రేపు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

రేపు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
Nagarjuna Sagar

నల్గొండ: రేపు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు. ఉదయం 11 గంటలకు సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని ఎన్ఎస్పీ అధికారులు విడుదల చేయనున్నారు. నాగార్జున సాగర్ సందర్శకుల అనుమతిపై పోలీసుల ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల్లో నీటి విడుదల దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు రాకూడదని నందికొండ మున్సిపాలిటీ పాలకవర్గం తీర్మానించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/