జీవితమే ఒక అపురూపమైన వరం

మనస్విని: మానసిక సమస్యలకు పరిష్కార వేదిక

Life is an incredible gift
Life is an incredible gift

మేడమ్‌, నా వయస్సు 45 సంవత్సరాలు. నేను ఒక గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తున్నాను. ఈ మధ్యనే నాకు ఆఫీస్‌లో వత్తిడి పెరిగిపోయింది. ప్రమోషన్‌ కూడారాలేదు. ఈ విష యమై నాకు చాలా బాధగా ఉంది. కుంగుబాటుగా ఉంది. ఏం చెయ్యాలో తోచటంలేదు. కొంచెం వివరించండి ఎలా బయట పడాలో ? -ప్రియమణి, హైదరాబాద్‌

మీరు తప్పక ఈ బాధ నుండి విముక్తి కాగలరు. ముందుగా మీరు మీ విలువను గ్రహించాలి. మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించాలి. మీ జీవితం విలువ మీరు గుర్తించాలి. మీకున్న వనరులను మొచ్చుకోవాలి. జీవితంలో సం పూర్ణ ఆనందం పొందాలి. ఉద్యోగం మీ జీవితంలో చాలా భిన్న భాగం మాత్రమే. ప్రమోషన్‌ రాలేదని అస్సలు చింతిచవద్దు. బాధపడవద్దు. ఆనందంగా ఉండండి మీ ఆనందం మీ మీద ఆధారపడి ఉంటుంది. ఆనందం అనేది మీరు తీసుకోవల్సిది. ఆనందం అనేది మీరు తీసుకోవల్సిన నిర్ణయం. దానికి వేరే వాటి ఆసరా అవసరం లేదు. పిల్లల్ని చూడండి, ఎంత ఆనందంగా ఉంటారో. ఏ వస్తు సంపదలు లేకపోయినా, చాలా హ్యాపీగా ఉంటారు. అలానే మనం కూడా ఉండాలి. ఎందుకంటే జీవితమే ఒక అపురూపమైన వరం. దీనిని సంపూర్ణంగా ఆస్వాదించాలి. రపతి నిత్యం ఆనందంగా ఉండాలి. వర్తమాకంలో జీవిం చాలి. జీవితం పట్ల ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. అంతేకానీ ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో పరితపించకూడదు.మంచి జరిగిన దాని గురించి ఆనందంగా ఉండాలి. మంచి, చెడులు మన జీవితం లో భాగమే. సుఖాలు, దుఃఖాలు జీవితంలో భాగమే. వాటిలో కొట్టుకొనిపోకూడదు. వాటికి మించి, జీవనసౌందర్యాన్ని ఆస్వాదించాలి. ఇదంతా ప్రయత్నపూర్వకంగా జరగాలి. ఎల్లప్పుడూ ప్రశాం తంగా ఉండాలి. ధ్యానంతో మనసు, హృద యం, ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. అందువల్ల ఆత్మ పరిశీలన చేసుకొంటూ, మీలో తప్పులు సరిద్దు కుంటూ, జీవి తాన్ని సృష్టతలో, అవగానలో, ఆనందమయం చేస కోవాలి.

మేడమ్‌ నా వయస్సు 39సం వత్సరాలు. ఒక ప్రైవేట్‌ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. కొంచెం కష్టమైన పని. మార్కె టింగ్‌ విభాగంలో చేస్తున్నాను. రోజూ 12 గంటలు పనిచేయ వలసివస్తోంది. అందువల్ల తరచూ తలనొప్పి వస్తోంది. చేతుల్లో కూడా చాలా తీవ్ర మైననొప్పి వస్తోంది. చేతులు పట్టుకోల్పోతున్నాయి. ఏంచేస్తే నా ఆరోగ్యంకుదుట పడుతుంది? కొంచెం వివరించండి ప్లీజ్‌. సువర్ణ, వరంగల్‌.

మీ ఆరోగ్యం తప్పక కుదుటపడుతుంది. మీ మానసిక వత్తిడి, పని వత్తిడివల్ల మీ శారీరక ఆరోగ్యం కూడా చెడి పోతోంది. అందువల్ల మీరు తప్పక, విశ్రాంతి తీసుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. మంచిగా నిద్రపోవాలి. పని ఎక్కువ గంటలు చేయ కూడదు. చక్కని విశ్రాంతిలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. శారీరక ఆరోగ్యంకూడా బావుంటుంది. ముందుగా వైద్యులను సంప్రదించి, తగు చికిత్సలు తీసుకోండి. ఈ మధ్యలో మీరు మీ ఉద్దేగాలను ఆనందంగా మంచుకోవాలి ఉద్యోగం జీవితంలో ఆనందాన్ని ఇవ్వాలితప్ప, ఇలా వత్తిడిని కలుగచేయనీయ కూడదు. పనిని ఇష్టపడి చెయ్యాలి.

కష్టపడి కాదు. హాబీలాగా ఉద్యోగం చెయ్యాలి. ఒక ఆట వలే ఆనందంగా చెయ్యాలి. జీవితం విలువైంది. సమయం వత్తిడిలో వృధా చేయవద్దు. పనివేళలు మీ నియంత్రణలో ఉండాలి. మీ శరీర ఆరోగ్యం గురించి మీ బాస్‌ ఆలోచిం చారు.మీరే ఆలోచిచంచుకోవాల. ఎవరిపనులు వారికుంటాయి. వేరే వారికి మీ గురించి పట్టించుకొనే సమయంలేదు.
అందుల్ల ఆరోగ్యం మీ వ్యక్తిగత బాధ్యత. ప్రతినిమిషం విలువైంది. ప్రతి క్షణం ఆనందంగా గడపాలి. మీ కిష్టమైన పనులు చేసుకుంటూ ఆనందంగా గడపాలి. జీవితం
విలువను తెలుసుకొంటూ మీరు మీ కుటుంబసభ్యులకు ఆదర్శంగా ఉండాలి. వారికి మీ ఆనందాన్ని పంచి పెట్టాలి. ఈ విషయంలో కౌన్సిలింగ్‌ తీసుకొంటే మంచిది.

-డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/