కాల్పుల విరమణకు ఇరుపక్షాల అంగీకారం

Putin and Erdogan
Putin and Erdogan

ట్రిపోలీ : ట్రిపోలీ కేంద్రంగా కొనసాగుతున్న జిఎన్‌ఎ ప్రభుత్వం, ఖలీఫా హఫ్తార్‌ నేతృత్వంలోని లిబియన్‌ నేషనల్‌ ఆర్మీ మధ్య సంధి చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ చేపట్టిన దౌత్యం ఫలప్రదమైంది. వీరిరువురి సూచన మేరకు ఆదివారం అర్ధరాత్రి నుండి కాల్పుల విరమణ పాటించేందుకు ఇటు జిఎన్‌ఎ ప్రభుత్వం అటు లిబియన్‌ నేషనల్‌ ఆర్మీ అంగీకరించటంతో లిబియాలో ప్రశాంత వాతావరణం ఏర్పడేందుకు మార్గం సుగమమైంది. పుతిన్‌, ఎర్డోగాన్‌ దౌత్యంలో జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ కూడా భాగస్వామిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. జనవరి 12 రాత్రి 12 గంటల నుండి కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ అక్కార్డ్‌ (జిఎఎన్‌) వర్గాలు ధృవీకరించాయి. ప్రత్యర్థులు గౌరవిస్తేనే ఈ ఒప్పందానికి విలువ వుంటుందని లిబియా నేషనల్‌ ఆర్మీ ప్రతినిధి అహ్మద్‌ మిస్మారీ వ్యాఖ్యానిం చారు. వాస్తవానికి కాల్పుల విరమణపై పుతిన్‌, ఎర్డోగాన్‌ గత వారారంభంలో ప్రారం భించిన దౌత్యాన్ని హఫ్తార్‌ తొలుత తిరస్క రించారు. తరువాత తాము పుతిన్‌ ప్రయ త్నాలను స్వాగతి స్తున్నామని, ట్రిపోలీని స్వాధీనం చేసుకున్న ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా తమ పోరు చివరివరకూ కొనసాగు తుందని ఆయన ఒక ప్రతినిధి ద్వారా స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/