సిఎం జగన్‌కు చంద్రబాబుకు లేఖ

cm jagan- chandrababu
cm jagan- chandrababu

అమరాతి: ఏపిలో వర్ష బీభత్సంపై టిడిపి అధినేత చంద్రబాబు సిఎం జగన్‌కు లేఖ రాశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించి ఆదుకోవాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల ఎన్యూమరేషన్ యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. తడిసి రంగుమారి దెబ్బతిన్న పంట ఉత్పత్తులను…కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోళ్లు జరపాలన్నారు. నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి ఆదుకోవాలని, ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోల్పోయిన చేనేత, చేతి వృత్తుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు. దెబ్బతిన్న వలలు, పడవల కొనుగోళ్లకు, దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందించాలన్నారు. వరదలకు కూలిపోయి, కొట్టుకుపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు మంజూరు చేయాలన్నారు. వాగులు, వంకలకు పడ్డ గండ్లు పూడ్చాలని, గుంతలు పడ్డ రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరపాలని చంద్రబాబు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/