పాక్‌ గగనతలంలో మోది ప్రయాణానికి అనుమతి!

narendra modi
narendra modi, PM

న్యూఢిల్లీ: పాక్‌ గగనతలంలో ప్రవేశించేందుకు అనుమతించాలంటూ భారత్‌ చేసిన విజ్ఞప్తిపై పాక్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మోది ప్రయాణించే విమానాన్ని తన గగనతలంలో ప్రవేశించేందుకు అనుమతినిచ్చింది. ఈ నెల కిర్గిస్థాన్‌లో జూన్‌ 13, 14 తారీఖుల్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు మోది హజరవుతున్నారు. అందుకే ప్రధాని పాక్‌ అనుమతి కోరింది. ఈ విషయంపై స్పందించిన పాక్‌ సూత్రప్రాయంగా తన అంగీకారాన్ని తెలిపింది. బాలాకోట్‌ దాడుల అనంతరం పాక్‌ తన గగనతలాన్ని మూసివేసింది. ప్రస్తుతం పాక్‌ ఆధీనంలో మొత్తం 11 రూట్లు ఉండగా అందులో కేవలం రెండింటిలో ప్రయాణించేందుకు భారత విమానాలకు అనుమతి ఉంది. ఈ రెండు రూట్లూ కాకుండా ప్రధాని మోది మరో రూట్‌లో ప్రయాణించాల్సి రావటంతో పాక్‌ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/