James Neesham and KL Rahul
మౌంట్ మౌంగనూయి: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్‌తో గొడవపడిన విషయం తెలిసిందే. అయితే మైదానంలో వాదులాడుకున్న ఈ ఇద్దరూ.. మ్యాచ్ అనంతరం ట్విటర్ వేదికగా మరోసారి తలపడ్డారు. కాకపోతే మైదానంలోలాగా వాడివేడిగా కాకుండా సరదాగా.. సంభాషించుకున్నారు. ఈ వ్యవహారం నెట్టింట హల్చల్ చేయడంతో జేమ్స్ నీషమ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. తొలుత రాహుల్.. అన్ని పరుగులు ఇప్పుడే చేయకు.. ఏప్రిల్ ఉంది సుమా.. కొన్ని దాచుకో’అంటూ రాహుల్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ సరదాగా ట్వీట్ చేశారు. అనంతరం వారిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.. అది చిన్న వాగ్వాదం అంతే.. ఎవరూ హద్దులు దాటలేదు’అంటూ బదులిచ్చాడు. ఆ వెంటనే ఈ గొడవకు సంబంధించిన ఫొటోకు పేపర్, కత్తెర, బండరాయి’అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశాడు. ఇక జిమ్మీ ట్వీట్‌కు రాహుల్ కూడా సరదాగా స్పందించాడు. ఈ గొడవను ఏప్రిల్‌లో పరిష్కరించుకుందాం.. సీ యూ’అంటూ ట్వీట్ చేశాడు. మైదానంలో ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్న ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం సరదాగా సంభాషించుకోవడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ నలుగురు కూడా దక్షిణాదికి చెందిన వారే కావడం…
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..సీఎం జగన్ కు లేఖ రాసారు. పేదపిల్లలకు ప్రభుత్వ విద్యని దూరం చెయ్యొద్దని…
రీసెంట్ గా కరోనా నుండి క్షేమంగా బయటపడ్డ నందమూరి బాలకృష్ణ..మళ్లీ సినిమా షూటింగ్లలో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈయన గోపీచంద్…
ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం పొన్నియిన్ సెల్వన్. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ లో సీనియర్ నటుడు వేణు…