కేంద్ర ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలి

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లోని పరిస్థితులు చాలా సున్నితమైనవని… అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ లో పలు ఆంక్షలను విధించారని… వెంటనే వాటిని ఎత్తివేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైప పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. ఇప్పటికిప్పుడు కేంద్రానికి తాము ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేమని స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్ లో ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని… అక్కడి పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత ఈ పిటిషన్ ను విచారిస్తామని తెలిపింది.

జమ్ముకశ్మీర్ లో పరిస్థితులను రోజువారీగా గమనిస్తున్నామని… జిల్లా కలెక్టర్ల నివేదికల ఆధారంగా ఆంక్షలను సడలిస్తున్నమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/