సమస్యల నుంచి నేర్చుకునే పాఠాలు

జీవన వికాసం

Lessons learned from problems
Lessons learned from problems

విజయం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఒక్కనాటి ప్రక్రియ కూడా కాదు. ఏ రోజుకారోజు కొనసాగుతు వెళ్లే నిరంతర సాధన. వాటితో స్వీయ క్రమశిక్షణ ముఖ్యమైనది.

సరిపడినంత నిద్ర అవసరం. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం ఉండాలంటే రోజు నిర్ణీత సమయంలోనే పడుకోవాలి. రోజుకు ఏడెనిమిది గంటల నిద్ర అవసరం.

ప్రతిక్షణం నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. వాయిదా వేయరాదు.

ఎంత క్లిష్ట సమస్యలో అయినా ఆలోచనలు వీడి చీకటిలోకి చూడరాదు. బ్రైట్‌గా ఆలోచించాలి. వెలుతురు కోసం వెతకాలి. డిసిప్లిన్‌గా ఉండాలి.

కరుణ, ప్రేమ, దయాగుణం, సునితత్వం కలిగి ఉండాలి. మార్పుకు భయపడకూడదు. మార్పును స్వీకరించాలి. ఆహ్వానించండి.

ఎదుర్కోండి అనే కన్నా ఎలాంటి ఎమోషన్‌ అయినా చక్కగా మేనేజ్‌ చేయగలగాలి. సమస్యలు ప్రగతికి సోపానాలు. ఒక్కొక్క సమస్య పరిష్కారంతో ఒక్కొక్క సోపానాన్ని అధిరోహిస్తూ దూసుకుపోవాలి. ధ్యానం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడగలదు.

ధ్యానం అవనసరమైన ఆలోచనలను నియంత్రిస్తుంది.

సమాచారాన్ని అతి తక్కువ సమయంలో మెదడులో భద్రపరచుకోవడం, విశ్లేషించగలగడం, అవసరమైనప్పుడు వేగంగా దాన్ని ఉపయోగించడం వంటి సామర్ధ్యాలను పెంచుకోగలడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

డైరీ రాయడం వంటి అలవాటు మనిషి వ్యక్తిత్వ వికాసానికి ప్రణాళికా బద్ధమైన జీవితానికి దోహదం చేస్తుంది.

డైరీ అంటే కేవలం రోజువారి కార్య కలాపాల నమోదు కాదు. వర్తమాన సమాజం వ్యక్తిపై చూపే ప్రభావం. మీరు రాస్తున్న డైరీ మీకు మార్గదర్శకమవుతుంది.

డైరీ రాయడం దినచర్యగా మారితే రైటింగ్‌ స్కిల్స్‌ ఎంతో మెరుగవుతుంది. చేసేపని ఇతరులు చేసేదానికన్నా భిన్నంగా ఉండేటట్లు ఆలోచించి చేయడం అలవరచుకోవాలి.

లక్ష్యాలు ఏర్పరచుకోవడం వాటి సాధనకు కృషి చేయడం ముఖ్యం.

పుస్తకపఠనం జ్ఞాపశక్తిని పెంచుకోవడానికి చక్కని మార్గం. పుస్తకం చదువుతున్నప్పుడు చదివిన విషయాన్ని నెమరువేసుకోవాలి. చదువుతున్న దాన్ని గుర్తుపెట్టుకోవాలి.

చదవబోతున్న దాన్ని ఊహించుకోవాలి. కొత్త ఆలోచనలు చేయాలి. జీవితాన్ని ఆనందించాలి, ఆస్వాదించాలి. వయసుకు తగినట్లుగా ప్రవర్తించాలి.

ఎక్కువ సమయం విశ్రాంతి కాకుండా శరీరానికి కొంత శ్రమను కలిగిస్తే మెదడుకు చురుకుదనం, ఆలోచనాశక్తి, నిర్ణయం తీసుకునే విల్‌పవర్‌ పెరుగుతుంది. చదరంగం జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ఆటలో ఒక అడుగు ముందుకేయాలంటే ఓ పది ఎత్తులను ఊహించుకోవాలి. ప్రత్యర్థి వ్యూహాల్ని అంచనా వేయాలి.. ఆ సాధన మెదడును చైతన్యపరుస్తుంది.

భిన్నంగా ఆలోచించి సృజనాత్మకత జోడించాలి. కష్టపడాలి. ఎదగాలి. రాణించాలి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని గుర్తించాలి. ప్రేమించాలి కాని ద్వేషించకూడదు. అందాన్ని ఆస్వాదించాలి.

మీలో ఆహ్లాదం పెరుగుతుంది. కుటుంబాన్ని ప్రేమించాలి. అది మీకు మల్లెల పందిరిగా మారుతుంది. స్వీయ క్రమశిక్షణ అలవరచుకోవాలి. సంతోషానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.

తమను తాము నియంత్రించుకోగల శక్తి సామర్ధ్యాలు అత్యుత్తమంగా ఉన్న వారు అవి లేనివారితో పోలిస్తే జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు.

పనిచేస్తున్న సమయం ఉత్సాహంగా, హుషారుగా ఉండాలి. ఆరోగ్య పరిరక్షణకు సమతుల ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పరుగెడుతున్నప్పుడు మెదడుకు రక్త ప్రసర బాగా జరుగుతుంది.

అందులో చెప్పులేకుండా ఉత్త పాదాలతో పరిగెడితే మరీ మంచిదని అధ్యయనాల్లో వెల్లడయింది. విజయం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు.

ఒక్కనాటి ప్రక్రియ కూడా కాదు. ఏ రోజుకారోజు కొనసాగుతు వెళ్లే నిరంతర సాధన. వాటితో స్వీయ క్రమశిక్షణ ముఖ్యమైనది. సరిపడినంత నిద్ర అవసరం.

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం ఉండాలంటే రోజు నిర్ణీత సమయంలోనే పడుకోవాలి. రోజుకు ఏడెనిమిది గంటల నిద్ర అవసరం. ప్రతిక్షణం నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. వాయిదా వేయరాదు.

ఎంత క్లిష్ట సమస్యలో అయినా ఆలోచనలు వీడి చీకటిలోకి చూడరాదు. బ్రైట్‌గా ఆలోచించాలి. వెలుతురు కోసం వెతకాలి. డిసిప్లిన్‌గా ఉండాలి. కరుణ, ప్రేమ, దయాగుణం, సునితత్వం కలిగి ఉండాలి.

మార్పుకు భయపడకూడదు. మార్పును స్వీకరించాలి. ఆహ్వానించండి. ఎదుర్కోండి అనే కన్నా ఎలాంటి ఎమోషన్‌ అయినా చక్కగా మేనేజ్‌ చేయగలగాలి.

సమస్యలు ప్రగతికి సోపానాలు. ఒక్కొక్క సమస్య పరిష్కారంతో ఒక్కొక్క సోపానాన్ని అధిరోహిస్తూ దూసుకుపోవాలి. ధ్యానం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడగలదు.

ధ్యానం అవనసరమైన ఆలోచనలను నియంత్రిస్తుంది. మన ఆలోచనల్ని మనమే ఎంపిక చేసుకునే శక్తినిస్తుంది. నమ్మకాన్ని పెంచుకోవాలి.

నమ్మలేని విజయాలు సొంత అవుతాయి. కాలం విలువ తెలుసుకుంటే ఆ కాలమే కాసుల వర్షం కురిపిస్తుంది.

జీవితాన్ని కుశలమయం చేస్తుంది. ఉప్పొంగే ఆత్మవిశ్వాసం, ఏదైనా చేయగలమన్న ధీమా, తమపై తమ శక్తిసామర్ధ్యాలపై అచంచల విశ్వాసం, ఉత్సాహంతో పని చేయడం పనులలను వాయిదా వేసే మనస్తత్వానికి పూర్తిగా దూరంగా ఉండాలి.

సమస్యలు సర్వసాధారణం. సమస్యలను చూసి భయపడరాదు. సమస్యలు వచ్చినపుడు కృంగిపోరాదు.

సమస్యల నుండి జీవిత పాఠాలను నేర్చుకోవచ్చునన్న భావనతో ఎదురయిన సమస్యలకు పరిష్కారాలు పరిశోధిస్తూ ముందుకెళ్లాలి.

నెవర్‌, కాన్ట్‌, వోన్ట్‌ అన్న పదాలను పూర్తిగా మీ మాటల నుండి పూర్తిగా తొలగించుకోవాలి. ఐకెన్‌, ఐవిల్‌, ఐవుడ్‌, లాంటి పాజిటివ్‌ పదాలను జీవితంలో అలవరచుకోవాలి. కష్టాలు, కల్లోలాలు, నష్టాలు, పరాజయాలు, అవమానాలు జీవితం అన్నాక ఇవన్నీ భాగమే.

పాజిటివ్‌ దృక్పథంతో వీటిని అధిగమించాలి. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగిపోవడం అలవరచుకోవాలి.

మంచి అలవాట్లతో జ్ఞాపకశక్తి ఎంతగా వికసిస్తుందో చెడు అలవాట్లతో అంతగా క్షీణిస్తుంది.

మద్యం, ధూమపానం, మాదక ద్రవ్యాలు మొదలునవి మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఆహారపానీయాలను తగు మోతాదులో తీసుకోవాలి.

అన్ని రకాల ఆహారపదార్థాలను మితంగా తీసుకోవాలి. తీపి, కొవ్వు పదార్థాలను వీలయినంతగా తగ్గించాలి. కృషి పట్టుదల, అంకితభావం విజయానికి మార్గం చూపిస్తే మనిషి ప్రవర్తన వ్యక్తిగత విలువలను పెంచేదిగా ఉండాలి.

పట్టుదలను పట్టుదలగా అభిమానించండి. అపజయాలు మీ నీడను తాకేందుకు భయపడతాయి. సక్సెస్‌ను విజువలైజ్‌ చేసుకోండి.

సక్సెస్‌ తర్వాత మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నించండి. అందరిలో ఒకరుగా కాకుండా కొందరిలో ఒకరుగా ఉండాలి.

క్రియేటివ్‌ ఆలోచనలతో ప్రత్యేకతను సంతరించుకోవాలి.

తాజా ‘నాడి వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/