అశ్విన్‌కు పాఠం చెప్పం : బిసిసిఐ

న్యూఢిల్లీ: క్రీడా స్పూర్తి గురించి రవిచంద్రన్‌ అశ్విన్‌కు లెక్చర్‌ ఇవ్వమని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. అతడు నిబంధనలకు లోబడే మన్కడింగ్‌ చేశాడని వెల్లడించారు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోరు మీదున్న జోస్‌ బట్లర్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సారథి అశ్విన్‌ మన్కడ్‌ ఔట్‌ చేశాడు. నాన్‌ స్ట్రైకర్‌ వైపుఉన్న బట్లర్‌ బంతి వేసేలోపే క్రీజు దాటి వెళ్లడంతో యాష్‌ బంతిని వికెట్లకు హెచ్చరించకుండానే గిరాటేశాడు. ఇది వివాదాస్పదమైంది. రాయల్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ షేన్‌ వార్న్‌ కోచ్‌ ప్యాడీ ఆప్టన్‌ మన్కడింగ్‌ చేయడాన్ని తప్పుపట్టారు. క్రీడాస్పూర్తి గురించి అశ్విన్‌కు ఎలాంటి పాఠం చెప్పం. ఆట నిబంధనలకు లోబడే అతడా ఆపనిచేశాడు. నిబంధనల ప్రకారం ఆడించేందుకు మైదానంలో అంపైర్లు రిఫరీలు ఉన్నారు. అందుకే బిసిసిఐ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోదు. ఇక షేన్‌ వార్న్‌ విషయమే తీసుకుంటే అతడు రాయల్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని తటస్థ వ్యక్తి కాడని గుర్తుంచుకోవాలని అధికారి అన్నాడు. .


మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/