కాలం ఏదైనా నిమ్మరసం మంచిదే

Lemon Juice Best in Any Season
Lemon Juice Best in Any Season

గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మచెక్క కలుపుకుని తాగడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శుభ్రమైన నీటిని మరగించి తాగే వేడివరకు చల్లార్చాలి. అరగ్లాసు నీటిలో నిమ్మచెక్క రసం పిండాలి. గింజలు లేకుండా చూడాలి. చక్కెర తదితర తీపి కారకాలను కలపకుండా పరగడుపున తాగాలి. తరువాత గంట విరామం ఇచ్చి బ్రేక్‌ఫాస్ట్‌చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే దిగువన పేర్కొన్న ప్రయోజనాలు కలుగుతాయి.
ర కాలేయం శుభ్రపడటంతో పాటు పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం మరిన్ని ఎంజైమ్స్‌ను ఉత్పత్తిచేస్తుంది.
ర ఆహారం సులభంగా జీర్ణమవ్ఞతుంది. మలబద్ధకం తగ్గి మోషన్‌ ఫ్రీగా అవ్ఞతుంది.
ర నిమ్మరసం రక్తంలో త్వరగా కలిసిపోయి అన్ని అవయవాలు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. భోజనానికి ముందు నిమ్మరసం తాగడం వల్ల పిహెచ్‌స్థాయిలు పెరుగుతాయి. తద్వారా రోగనిరోధకశక్తి గణనీయంగా పెరిగి శరీరం వ్యాధులను సమర్థంగా ఎదుర్కొంటుంది.
ర నిమ్మరసం యూరిక్‌యాసిడ్‌ను పలుచనచేసి కీళ్లనొప్పులు, గౌట్స్‌ వంటి రుగ్మతల బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది.
ర నోటిలో బాగా లాలాజలం ఊరుతుంది. అందువల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
ర శరీరంలో కఫాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.
ర నిమ్మరసంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇది సోడియంతో కలిసి మెదడు, నాడీ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో పొటాషియం నిల్వలు తగినన్ని ఉంటే మానసిక ఆందోళన, ఒత్తిడి, మందకొడితనం, మతిమరపు వంటి సమస్యలు రావ్ఞ. గుండె పనితీరు మెరుగుపడటంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రక్తంలో నిమ్మరసం కాల్షియం, మెగ్నీషియం నిల్వలు సమృద్ధిగా ఏర్పడతాయి. తగినంత స్థాయిలో కాల్షియం ఉండటం వల్ల రికెట్స్‌ వ్యాధి సోకే అవకాశం ఉండదు. మెగ్నీషియం గుండెకు చాలా మంచిది.