బిల్లులకు శాసనసభ ఆమోదం
ప్రశ్నోత్తరాల రద్దు.. కీలక బిల్లులపై చర్చ

Hyderabad: తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి పలు కీలక బిల్లులపై చర్చను ప్రారంభించారు.
చర్చ అనంతరం బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పదేళ్లు పొడిగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణకు శాసనసభ ఆమోదం తెలిపింది.
జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 29 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగిస్తూ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
తెలంగాణ లోకాయుక్త-2020 సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ శాసనసభ తీర్మానం చేసింది.
అభయహస్తం పథకం రద్దు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మహిళా సంఘాల కో కాంట్రిబ్యూటరీ పింఛను రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది.
తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/health/