ఆర్టీసీ కార్మికుల కోసం వామపక్షాల సామూహిక దీక్ష

Professor Nageshwar
Professor Nageshwar

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం వామపక్ష పార్టీలు ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగాయి. దీనికి ప్రజాసంఘాల నాయకులు ఇతర నేతలు మద్దతు నిచ్చాయి. సీపీఐ, సీపీఎంతో పాటు ప్రజా సంఘాలు ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. ప్రభుత్వం లాభాలు వచ్చె రూట్లలో ప్రైవెటు బస్సులను నడుపుతు నష్టాలు వచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపుతూన్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య దీక్షకు తమ మద్దతు తెలిపారు. అనంతరం ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె జీతాల కోసం కాదని ఆర్టీసీ పరిరక్షణ కోసమని చెప్పారు. కార్మికుల వల్లె ఆర్టీసీకి నష్టమని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని నాగేశ్వర్‌ మండిపడ్డారు. ఈ దీక్షలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరియు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.ఆర్టీసీ పట్టణ రవాణలోనే ఏటా రూ.720 కోట్ల నష్టం వస్తోంది. అద్దె బస్సులను పెంచడం వలన ఆర్టీసీ మునిగిపోతుందని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావు అన్నారు. కాగా ఈ సందర్భంగా వారు ప్రాణాలు కోల్పొయిన ఆర్టీసీ కార్మికులకు నివాళిలు ఆర్పించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/