త్వరగా భారత్ ను వీడి స్వదేశానికి వచ్చేయండి

దేశపౌరులకు అమెరికా ఆదేశం

leave India and return ; US orders issued to citizens
leave India and return ; US orders issued to citizens

Washington: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇండియాను వీడి స్వదేశానికి వచ్చేయాలని తమ దేశ పౌరులను అమెరికా ఆదేశించింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ ఆఫైర్స్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యానికి గురైతే వైద్యం పొందడం అంత సులువు కాదని పేర్కొంది. అందువలన భారత్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా లెవల్ 4 హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా రోజువారీ డైరెక్ట్ విమానాల ద్వారా యూఎస్ చేరుకోవాలని సూచించింది. నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేనిపక్షంలో వయా పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ ద్వారా స్వదేశానికి చేరుకోవాలని ఆదేశించింది. . భారత్‌కు ఎవరూ ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించింది.   

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/