ఉత్తమ్‌ను చూస్తుంటే జాలేస్తుంది!

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై చరిత్ర తెలుసుకొని మాట్లాడు!

k laxman
k laxman

హైదరాబాద్‌: ఏడు దశాబ్దాల పాలనలో సామాజిక న్యాయం మీరు చేశారో? మేము చేశామో? అన్న అంశంపై చర్చకు సిద్ధమా? అని ఉత్తమ్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. దొంగే.. దొంగ..దొంగ అని అరిచినట్లుగా కాంగ్రెస్‌ వైఖరి ఉందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ నిర్వాకం కారణంగా సుప్రీం తీర్పునిస్తే ఆ నెపాన్ని మోదీ ప్రభుత్వంపై నెడతారా? అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అమలులో కేంద్రం వైఖరిని నిరసిస్తూ 16న ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఉత్తమ్‌ ప్రకటించడంపై లక్ష్మణ్‌ మండిపడ్డారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ కనుమరుగవుతోందని, ఉత్తమ్‌ను చూస్తుంటే జాలేస్తోందని వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌ సామాజిక స్పృహ ఉండే మాట్లాడుతున్నారా? తెలిసి మాట్లాడతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/