టెన్నిస్‌కు లియాండర్‌ పేస్‌ వీడ్కోలు!

Leander Paes
Leander Paes

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ (46) వచ్చే ఏడాది కెరీర్‌కు వీడ్కోలు చెప్పనున్నారు. తన సుదీర్ఘ ప్రొఫెషనల్‌ కెరీర్‌కు 2020లోనే తెరదించుతానని, ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆటగాడిగా వచ్చే సంవత్సరమే నాకు చివరిది అని ఓ ప్రకటనలో పేస్‌ తెలిపారు. వచ్చే ఏడాది కొన్ని టోర్నీలను ఎంపిక చేసుకొని జట్టుతో ప్రయాణించి ప్రపంచంలోని తన అభిమానులతో వీడ్కోలు సంబురాలు చేసుకుంటానని పేర్కొన్నారు. ‘2020 టెన్నిస్‌ కేలండర్‌ కోసం ఎంతో ఎదురు చూస్తున్నా. వచ్చే ఏడాది ఎంపిక చేసుకున్న టోర్నీలలో మాత్రమే ఆడుతా. నా జట్టుతో ప్రయాణించి ప్రపంచంలోని నా స్నేహితులు, అభిమానులతో వీడ్కోలు సంబురాలు చేసుకుంటా’ అని లియాండర్‌ పేస్‌ తెలిపారు. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. మీ మద్దతు లేకుండా నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నా ఇద్దరు అక్కలు కూడా. కూతురు అలన, నాకు స్ఫూర్తి ఇచ్చిన అభిమానులకూ థ్యాంక్స్‌’ అని పేస్‌ అన్నారు. కాగా 1991లోనే తన ప్రస్థానాన్ని ఆరంభించిన పేస్‌ ఇప్పటి వరకు 28 ఏళ్లకు పైగా టెన్నిస్ ఆట ఆడారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/