మాజీ ప్రధాని నెహ్రుకు ప్రముఖుల నివాళి

tribute to nehru
tribute to nehru

ఢిల్లీ: మాజీ ప్రధాని నెహ్రుకు పిల్లలంటే చాలా ఇష్టం నెహ్రు మన దేశానికి మొదటి ప్రధానమంత్రి ఆయన పసివాళ్లను గూలాబీలతో పోల్చిన నెహ్రు.. అభం శుభం తెలియని బాలలకు బంగారుబాట పరవాలని కలలు కన్నారు. నవంబర్‌ 14వ తేదీ నెహ్రు పుట్టిన రోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం. నెహ్రు జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు ఆర్పించారు. ఈ మేరకు ఢిల్లీలోని శాంతివనం వద్ద ఉన్న ఆయన సమాధి వద్ద మజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులు ఆర్పించారు. ఇంకా పిల్లల పట్ల ఆయన చూపించే ప్రేమ, అప్యాయతలకు గుర్తుగా ఆయన చాచా నెహ్రు అని కూడా పిలుస్తారు.
తాజా తెలంగాణ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/