పడక కుర్చీ నాయకులు ఆలోచించాలి

ఒక్కమాట.. (ప్రతిశనివారం)

ఇన్నేళ్లు సుదీర్ఘమైన పోరాటంలో కాంగ్రెస్‌ ఎన్నో ఒడిదుడుకులు, చీకటి వెలుగులను చవిచూసింది. కాంగ్రెస్‌ నేటికీ సజీవంగా ఉందంటే ఆనాడు స్వాతంత్య్ర సమరంలో పెద్దలు చేసిన త్యాగం జాతి నిర్మాణంలో వారు అనుసరించిన వైఖరి విధానాలే. ఆ తర్వాత ఇందిరాగాంధీ పేద ప్రజల అభ్యున్నతికి చేపట్టిన సంస్కరణలను నేటికీ కాంగ్రెస్‌ పార్టీని కొన్నివర్గాల మనస్సుల్లో స్థానం సంపాదించి పెట్టాయి. ఆ వర్గాలు కూడా కొందరు కాంగ్రెస్‌ నేతల ప్రవర్తన కారణంగా క్రమేపీ దూరమైపోతున్నాయి.

Political Senior Leaders Caricature

అందుకు ముందుగా నిందించాల్సింది, తప్పుపట్టాల్సింది హస్తినలోని అధిష్టాన పెద్దలనే. ఆ ప్రభావం రాష్ట్రాలపై కూడా చూపుతున్నది. తెలంగాణాలో వ్యూహాత్మకంగా పొరపాట్లు, తప్పులతో అవమానకర వరుస పరాజయాల తర్వాత కూడా పార్టీనేతల్లో కనువిప్పు కలగకపోవడం దురదృష్టకరం. వాస్తవంగా ఓటమి అనేది భవిష్యత్తులో సాధించబోయే విజయానికి నిచ్చెనలా ఉపయోగపడాలి. చేసిన పొరపాట్లను, తప్పులను సమీక్షించుకొని, ఆత్మపరిశీలన చేసుకొని ముందుకు అడుగులు వేస్తే అదే ఓటమి మళ్లీ ఎదిగేందుకు ఒక మెట్టులా ఉపయోగపడుతుంది.

కొకొ డుగు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయస్సులో, భర్త గుణం భార్య అనారోగ్యంలో, భార్య గుణం భర్త పేదరికంలో, స్నేహితుని గుణం కష్టకాలంలో, పిల్లల గుణం వృద్ధాప్యంలో అలాగే నాయకుల గుణం పార్టీ అధికారం, ప్రాబల్యం కోల్పోయినప్పుడు తెలుస్తుందంటారు. కష్టకాలంలో కలిసి ఉండటం, కలిసి ఉంచడం అందరి వల్ల సాధ్యమయ్యే పనికాదు. చెరువ్ఞల్లోకి నీరు చేరినప్పుడు కప్పలు చేరుకున్నట్లే కలిమి,అధికారం కలిగిననాడు వందిమాగధులు చకచక చేరుకుంటా రు. నీరు పోగానే కప్పలు ఎలా వెళ్లిపోతాయో వీరు కూడా అలా అదృశ్యమైపోతారు.

పేదరికం అనేది స్నేహితులను చివరకు కుటుంబాలను కూడా విడదీస్తుంది. అలాగే అధికారం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండదు. ఒకసారి హోదా అనుభవించి ఆ తర్వాత పదవి లేకుండా సాధారణ వ్యక్తులుగా జీవనం సాగించ డం అందరూ అంత సులభంగా జీర్ణించుకోలేరు. రాజకీయాల్లో పదవ్ఞల్లో లేని వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో వారు అంతకుముందు పదవ్ఞల్లో ఉన్నప్పుడు ఎలా ఒక వెలుగు వెలిగారో బేరీజు వేసుకుంటే ఆశ్చర్యం కలుగకతప్పదు.

పురుషుల్లో పుణ్యపురుషులు వేరన్నట్టు కొందరు అధికారం ఉన్నా లేకపోయినా ఒకే తీరులో వ్యవహరించే నాయకులు లేకపోలేదు. అయితే అలాంటి వారి సంఖ్య రానురాను కనుమరుగైపోతున్నదేమోననిపి స్తున్నది. అధికారంలో లేనప్పుడు అందరిని ఐక్యంగా గీటు దాట కుండా ఉంచడమనేది ఎంత కష్టతరమైన పనో వేరే చెప్పక్కర్లేదు. పార్టీ రాజకీయ పరిస్థితి ఆశాజనకంగా లేనప్పుడు, కనుచూపుమెర లో మెరుగుపడే అవకాశాలు లేనప్పుడు కప్పదాట్లు ఆపడం సామాన్యమైన విషయం కాదు.

సిద్ధాంతాలు, క్రమశిక్షణ, నైతిక విలువలు, జవాబుదారీతనం మృగ్యమైపోతున్న ఈ దురదృష్టకర మైన రోజుల్లో పార్టీలోని సభ్యులను, శ్రేణులను కట్టడి చేయడం సాధ్యమయ్యేపనికాదని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నదేమోననిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ లోనైతే ఉనికి కూడా కోల్పోయిందనే చెప్పొచ్చు.ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో ఒక్కరంటే ఒక్క సభ్యుడు కూడా లేరంటే అర్థం చేసుకో వచ్చు.ఇక తెలంగాణాలో అంతోఇంతో ఉన్నా దాన్ని కాపాడుకోవ డంలో విఫలమవ్ఞతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుండి స్థానిక సంస్థల ఎన్నికలు, నిన్నటి సహకార సంఘాల ఎన్నికలు ఏ ఎన్నికలు పెట్టినా అవమానకర పరాజయం పాలవ్ఞతున్నారు.

పిసిసి అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడంతో అధ్యక్షపదవి మరొకరికి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఈ మేరకు అభిప్రాయసేకరణ కూడా అధిష్టానవర్గం సేకరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటూ తేల్చకుండా నాంచుడు వైఖరి అధిష్టానవర్గం అవలంబిస్తున్నది. ఎంతటి తీవ్ర విషయాన్ని అయినా ఎన్ని రోజులు అయినా నాంచి నాంచి ఎదురు చూసి కళ్లుకాయలు కాచేలా చేయడంలో కాంగ్రెస్‌ అధిష్టానవర్గానికి మించిన పెద్దలు లేరని చెప్పొచ్చు.

కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తుందన్న మాట కొంతవరకు, కొన్ని సందర్భాల్లో వాస్తవమే కావచ్చు.తొందరపాటు పనికిరాదనేదినిజమే కావచ్చు.కానీ ఆలస్యంతో అమృతంకూడా విషం అవ్ఞతుందనేపెద్ద ల సూక్తిని విస్మరించరాదు.గతంలో ఎన్నో అనుభవాలు చూసిన తర్వాత కూడా హస్తినలోని ఈ కాంగ్రెస్‌ పెద్దలు ఈ జాడ్యాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు. అన్నింటికంటేమించి అపార అనుభవం కలిగి యువతరానికి ఆదర్శనీయంగా,అనుకరణీయంగా ఉండాల్సిన కొందరు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రవర్తిస్తున్న తీరు లోపాయి కారిగా ప్రత్యర్థి పార్టీలతో చేసుకుంటున్న ఒప్పందాలు కాంగ్రెస్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఒకపక్క టిపిసిసి నూతన అధ్యక్షుని కోసం అభిప్రాయసేకరణ జరుగుతుంటుంది.

మరొక పక్కన అధ్యక్షుణ్ణి మార్చే ప్రసక్తే లేదనిరాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతీయ ప్రకటిస్తుంటారు. నిజంగా అధిష్టానం ఆలోచ నలో ఉంటే ఇదంతా ఎందుకు చేసి నట్టు? అసలు జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవే అయోమయంలో ఉంటే ఇక రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి విషయం ఎవరు ఆలోచిస్తారు.ఎవరు పట్టించుకుంటారనే ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఎన్నడూలేనివిధంగా నాయకత్వలేమితో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.రాహుల్‌గాంధీ అవినీతి అంటని నిజాయితీపరుడైన నాయకుడే కావచ్చు.

కానీ ఆయనకు రాజకీయ పరిణితి రావడంలేదు. పదవ్ఞలపై కానీ, అధికారంపై కానీ పెద్దగా ఆశఉన్నట్టు కన్పించదు.రాజకీయ నాయకులకు ఉండాల్సిన టక్కు టమార విద్యలు అంతగా అబ్బినట్టు లేదు.ఎవరి ఒత్తిడో బలవం తం మీదనో రాజకీయాల్లో కొనసాగుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారే కానీ అధికారాన్ని సాధించాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కన్పిం చదు.ఇక ప్రియాంకగాంధీ పట్ల ఇప్పటికీ ప్రజల్లోకొంత మోజు ఉంది.ప్రజలు ఆమెలో ఇందిరమ్మను చూస్తున్నారు.

నడక, చురుకు దనం, వేషభాషల్లో వ్యవహారశైలి వంటివి ఇందిరమ్మను తలపింప చేస్తున్నాయి.వీరిద్దరు తప్ప నెహ్రూ కుటుంబం నుంచి ప్రస్తుతానికి ఎవరూ లేరు. వాస్తవానికి స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్‌ పార్టీని రద్దు చేయాలని మహాత్ముడు సలహా ఇచ్చారు. కానీ జవహార్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభా§్‌ు వంటి నేతలు అందుకు అంగీకరించ లేదు.

కానీ ఒక్కటి మాత్రం నిజం. కాంగ్రెస్‌ పేరుతో అధికారం చెలాయించాలని, అనుభవించాలన్న స్వార్థంతో వారు గాంధీని వ్యతిరేకించలేదు. ఆనాడు ఉన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. మతకలహాలు విజృంభించాయి. అరాచకం రాజ్యమేలు తున్నది. సరిహద్దుల్లో లక్షలాది మంది ఊచకోతకు గురవ్ఞతు న్నారు. లక్షలాది మంది పౌరులు పాకిస్థాన్‌, భారత్‌ల మధ్య వలసపోతున్నారు. దేశంలో నాలుగువందల యాభైకిపైగా సంస్థానాలు ఉండగా అందులో కొన్ని భారత్‌లో విలీనానికి ఇష్ట పడ లేదు. ముఖ్యంగా కాశ్మీర్‌, హైదరాబాద్‌ గ్వాలియర్‌, జైపూర్‌ వంటి రాజులకు సొంతసైన్యం ఉంది.ఏ మాత్రం రాజకీయ అస్థి రత ఏర్పడితే తమను తాముగా స్వాతంత్రులుగా ప్రకటించుకునే అవకాశాలు స్పష్టంగా ఆనాడు ఉన్నాయి.

అది దేశాన్ని ముక్కలు చెక్కలుగా చేస్తుంది.భారతదేశం అనేది రూపులేకుండాపోయే ప్రమాదం కళ్లముందు భయపెడుతుంది. అలాంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని రక్షించాలంటే కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు తీసుకోవ డం ఒక్కటే మార్గమనిపటేల్‌, నెహ్రూవంటి నేతలు గాంధీ మాట లను తోసిపుచ్చారు. ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఈ రోజు సమాఖ్య అఖండ భారత్‌గా ప్రపంచంలోనే విశిష్టమైన గుర్తింపు సంపాదించుకున్నది.

ఇన్నేళ్లు సుదీర్ఘమైన పోరాటంలో కాంగ్రెస్‌ ఎన్నో ఒడిదుడుకులు, చీకటి వెలుగులను చవిచూసింది. కాంగ్రెస్‌ నేటికీసజీవంగా ఉందంటే ఆనాడు స్వాతంత్య్ర సమరం లో పెద్దలు చేసిన త్యాగం జాతి నిర్మాణంలో వారు అనుసరించిన వైఖరి విధానాలే.ఆ తర్వాత ఇందిరాగాంధీ పేద ప్రజల అభ్యున్న తికి చేపట్టిన సంస్కరణలను నేటికీ కాంగ్రెస్‌ పార్టీని కొన్ని వర్గాల మనస్సుల్లో స్థానం సంపాదించి పెట్టాయి. ఆ వర్గాలు కూడా కొందరు కాంగ్రెస్‌ నేతలప్రవర్తన కారణంగా క్రమేపీ దూరమైపోతు న్నాయి.

అందుకు ముందుగా నిందించాల్సింది, తప్పుపట్టాల్సింది హస్తినలోని అధిష్టాన పెద్దలనే. ఆ ప్రభావం రాష్ట్రాలపై కూడా చూపుతున్నది.తెలంగాణాలో వ్యూహాత్మకంగా పొరపాట్లు, తప్పు లతో అవమానకర వరుస పరాజయాల తర్వాత కూడా పార్టీ నేతల్లో కనువిప్పుకలగకపోవడం దురదృష్టకరం. వాస్తవంగా ఓటమి అనేది భవిష్యత్తులో సాధించబోయే విజయానికి నిచ్చె నలా ఉపయోగపడా లి. చేసిన పొరపాట్లను, తప్పులను సమీక్షిం చుకొని, ఆత్మపరిశీలన చేసుకొని ముందుకు అడుగులువేస్తే అదే ఓటమి మళ్లీ ఎదిగేందుకు ఒక మెట్టులా ఉపయోగపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇతర పార్టీల్లోయువతరం ముందుకు దూసుకువెళ్తున్నది.

కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నేతలు ఆలోచిం చాలి.కొందరు సినీయర్‌ నాయ కుల ప్రవర్తన యువకార్యకర్తల్లో చాలా ప్రభావం చూపుతున్నది. ప్రజల కోసం పనిచేసే కంటే ఎవరో ఒక నాయకుడిని పట్టుకుంటే సరిపో తుందనే భావనతో వారి తోకలుగానో బాకాలుగానో బంట్లుగా వ్యవహరించే ధోరణి ప్రబలిపోతున్నది. సేవాభావం, సమస్యల పోరాటంతో నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాల్సిన యువత అందకు భిన్నంగా పయ నిస్తున్నది.

ఇప్పటికే కొందరు కార్యకర్తలు పక్క పార్టీ కండువలు కప్పుకుంటున్నారు. మరికొందరు అదే బాటవైపు చూస్తున్నారు. పునాదిలేని ఇళ్లు ఉండవ్ఞ. ఉన్నా అవి ఎక్కువ కాలం నిలవవ్ఞ. కార్యకర్తలు లేని పార్టీకి మనుగడ ఉండదన్నది వాస్తవం.

ఇది అపార అనుభవం ఉన్న నేతలకు తెలియందికాదు. ఈ పరిస్థితు లను సమూలంగా మార్చడానికి అటు హస్తిలోని పెద్దలు, ఇటు రాష్ట్ర నేతలు ఆత్మపరిశీలన చేసుకొని తమవై ఖరిలో మార్పుకు శ్రీకారం చుట్టాలి. ఇందులో ఏమాత్రం జాప్యం చేసినా పొరుగు నున్న ఆంధ్రప్రదేశ్‌లాగానే ఇటు తెలంగాణాలోనూ అటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది.

  • దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/