కొన్ని అదృశ్య శక్తులు ఢిల్లీలో అల్లర్లు సృష్టించాయి

సీఏఏపై మతం రంగు పులుముతున్నారు

dr k laxman
dr k laxman

హైదరాబాద్‌: దేశాన్ని అస్తిరపరిచేందుకు కొన్ని అదృశ్య శక్తులు ఢిల్లీలో అల్లర్లు సృష్టించాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. బిజెపి ప్రత్యర్థులు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. బిజెపి రాష్ట్ర కార్యలయంలో ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో సీఏఏపై న్యాయవాదులు, వైద్యులతో నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పెరుగుతున్న ఆదరణ చూడలేకే సీఏఏపై మతం రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌సీ అంశంపై కొందరు ముస్లింలను రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. భారత్‌లో ముస్లింలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని..52 ముస్లిం దేశాల్లో లేని స్వేచ్ఛ భారతీయ ముస్లింలకు ఉందని లక్ష్మణ్‌ గుర్తు చేశారు. శరణార్థులకు పౌరసత్వం ఇస్తామంటే ఆందోళన చేయడం సరికాదని లక్ష్మణ్‌ హితవు పలికారు. సీఏఏ అనుకూలంగా బిజెపి ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్వహించనున్న సభకు అందరూ హాజరుకావాలని లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/