రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన లక్ష్మణ్ గిలువా

రాంచీ: బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా రాజీనామా చేసారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం కారణంగా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. చక్రధర్పూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన లక్ష్మణ్ ముక్తి మోర్చా పార్టీ అభ్యర్థి సుఖ్రామ్ చేతిలో ఓటమిని చవి చూడడంతో… ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడంటంతో హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడి కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 81 స్థానాలకు ఈ కూటమి 47 స్థానాల్లో విజయం సాధించింది. దీని వల్ల ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సులభం అవ్వడంతో డిసెంబర్ 29న జేఎంఎం అధినేత హేమంత్ సొరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/