లాయర్లమధ్య ‘అయోధ్యఘర్షణ

supreme court
supreme court

న్యూఢిల్లీ: దశాబ్దాల కాలంగా న్యాయస్థానాల్లో నలుగున్న అయోధ్య భూ వివాదంపై తుది విచారణ ముగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. అయోధ్య భూ వివాదంతో ముడిడి ఉన్న అన్ని సంఘాలు, ప్రతినిధులు, న్యాయవాదులు సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గగో§్‌ు నేతృత్వంలోని ఐదుగురుసభ్యుల ధర్మాసనం అన్ని పక్షాల వాదోపవాదనలను వింటున్నది. విచారణ సమయంలో న్యాయవాదుల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గగో§్‌ు ఎదురుగానే ఒకరినొకరు తోసుకున్నారు.

ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పదవీ విరణమ చేసిన ఐపిఎస్‌ అధికారి కునాల్‌ కిశోర్‌ అయోధ్య భూ వివాదంపై రాసిన ‘అయోధ్య రీ విజిటెడ్‌ పుస్తకాన్ని చింపివేసేందుకు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. అయోధ్య భూవివాదం కేసు విచారణ సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అయోధ్య రివిజిటెడ్‌ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని అంశాలను న్యాయవాది వికాస్‌సింగ్‌ చదవడానికి ప్రయత్నించే సమయంలో సున్నీ వక్ఫ్‌ బోర్డు తరఫున కేసును వాదిస్తున్న న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ పుస్తకాన్ని లాగేసుకుని చింపేయడానికి ప్రయత్నించారు. కొన్ని పేజీలను చింపేశారు కూడా. దాంతో ఇతర న్యాయవాదులు ధవన్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ హైడ్రామాను చూసి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గగో§్‌ు తీవ్ర ఆగ్రమాన్ని వ్యక్తం చేశారు. న్యాయవాదుల ప్రవర్తన పట్ల ఆయన అసహయాన్ని వ్యక్తం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/