వైఎస్‌ఆర్‌ చేయూత రెండో విడత ప్రారంభం

YouTube video
Launching of 2nd Phase “YSR CHEYUTHA” By Hon’ble Ministers PR &RD and MA & UD at Tadeapalli

అమరావతి: ఏపిలో వైఎస్‌ఆర్‌ చేయూత రెండో విడత ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. ‘వైఎస్‌ఆర్‌ చేయూత’మొదటి దశలో 21 లక్షల మంది మహిళలకు రూ. 4 వేల కోట్లు వారి ఖాతాల్లో జమచేశామని తెలిపారు. రెండో విడతలో భాగంగా 2.72 లక్షల మంది మహిళలకు రూ.510.01 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూరనుందని ఆయన పేర్కొన్నారు. ఏటా రూ.18,750 చొప్పున నాలుగు ఏళ్లకు రూ.75,000 ఆర్ధిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ పధకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పధకం మహిళలకు ఓ వరమని, సిఎం జగన్‌ మహిళలకు గొప్ప సాయం చేస్తున్నారని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/