‘వైఎస్సార్ ఆసరా’ ప్రారంభం

రూ.6,792.20 కోట్లను మ‌హిళ‌ల ఖాతాలో జమ చేసిన సీఎం జ‌గ‌న్

AP CM YS Jagan
AP CM YS Jagan

Amaravati: క‌్యాంపు కార్యాల‌యంలో సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని ప్రారంభించారు.

అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన పెద్ద హామీ నేటి నుంచి అమలు కానుంది.

8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది.

తొలి విడతలో రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా నేడు జమ చేశారు.. ఆన్ లైన్ ద్వారా ఈ మొత్తాన్ని జ‌గ‌న్ ఆయా ల‌బ్దిదారుల ఖాతాల‌లోకి ట్రాన్స్ ఫ‌ర్ చేశారు..

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/