హైదరాబాద్‌లో మెడికల్‌ పోర్టల్‌ ప్రారంభం

ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి: కిషన్‌రెడ్డి

kishan reddy
kishan reddy

హైదరాబాద్‌: దేశంలో కరోనాను ఎదుర్కోనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంకిత భావంతో పనిచేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. డిల్లీ మత ప్రార్ధనలకు వెల్లిన వారు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారని అందుకు దేశంలో ఇంకా కరోనా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. హైదరాబాద్‌లోని బిజెపి నగర కార్యాలయంలో మెడికల్‌ పోర్టల్‌ను ఢిల్లీనుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు…. తెలంగాణ లో నమోదు అయిన కేసులలో ఆరవై శాతం కేసులు మర్కజ్‌ కు వెళ్లి వచ్చిన వారివే. ఒక్కో ఇంటిలో ఇరవై నుంచి ముఫ్పై కేసులు కూడా నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని రాష్ట్రానికిక పంపింది. ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సలహలు, సూచనలు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఓపి సేవలు నిలిపివేయడంతో ఎమర్జెన్సీ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి, అనారోగ్యానికి గురయితే ఎక్కడికి వెళ్లాలో కూడా తెలీదు. ఇలాంటి ఆదువారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది డాక్టర్లు పేద ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. వారికి అభినందనలు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌ చేసుకోవాలని అన్నారు. ఈ యాప్‌లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే .. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుందన్నారు. అలాగే మీ చుట్టు ఉన్న వారికి కరోనా ఉంటే అలర్ట్‌ చేస్తుందని మంత్రి చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/