వరంగల్‌లో కరోనా పరీక్షల ల్యాబ్‌ ప్రారంభం

ప్రజలందరు సామాజిక దూరం పాటించాలి: ఎర్రబెల్లి దయాకర్‌ రావు

errabelli dayakar rao
errabelli dayakar rao

తెలంగాణ: కరోనా కట్టడికి ప్రజలు లాక్‌డౌన్‌ నిబందనలు పాటించాలని, అప్రమత్తంగా ఉంటూ కరోనా ను తరిమి కొట్టాలని రాష్ట్రపంచాయితి రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాకతీయ మెడికల్‌ కాలేజి ఆవరణలో రూ.1.75 కోట్లతో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షలు నిర్వహించే ప్రత్యేక ల్యాబ్‌ను మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు ప్రజలందరు సామాజిక దూరం పాటించాలని అన్నారు. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ ఇంకా రాలేదు కాబట్టి ప్రజలందరు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించాడు. రాష్ట్రంలో కరోఆ విస్తరిస్తున్న కారణంగా వరంగల్‌లో కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ను ప్రారంభించామన్నారు. ఇక్కడ షిఫ్ట్‌కు 100 పరీక్షలు చేయవచ్చన్నారు. అవసరాన్నిబట్టి రెండు, మూడు షిఫ్‌లుగా కూడా ల్యాబ్‌ పనిచేస్తుందని తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/