ప్రారంభమైన సాగర్-‌శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం

ప్రారంభమైన సాగర్-‌శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం
Nagarjuna Sagar to Srisailam Boating started

హైదరాబాద్‌: నాగార్జునసాగర్-‌శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం మళ్లీ ప్రారంభమయ్యింది. ఈ మేరకు లాంచీ ప్ర‌యాణాన్ని నందికొండ మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ అనూషారెడ్డి ఈరోజు ప్రారంభించారు. దీంతో ‌సాగ‌ర్‌లోని హిల్‌కాల‌నీ నుంచి 16 మంది ప‌ర్యాట‌కుల‌తో శ్రీశైలానికి లాంచీ బ‌య‌లుదేరింది. ఆరుగంట‌ల‌పాటు కృష్ణా న‌దిలో ప్ర‌యాణించి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు శ్రీశైలం చేరుతుంది. శ్రీశైలంలోని ద‌ర్శ‌నీయ స్థ‌లాలు, దైవ‌ద‌ర్శ‌నం చేయించి బ‌స‌క‌ల్పించేలా ప‌ర్యాట‌క‌శాఖ ఏర్పాట్లు చేసింది. రేపు ఉద‌యం శ్రీశైలం నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు సాగ‌ర్ చేరుతుంది. అక్క‌డి నుంచి ప‌ర్యాట‌కుల‌ను బ‌స్సులో హైద‌రాబాద్‌కు తీసుకువ‌స్తారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/