నవ్వు నాలుగు విధాలా మేలు

ఆ విధాలు ఏమిటి?

Laughter is good in four ways
Laughter is good in four ways

ఈ సృష్టిలో భూమిపై, ఆకా శంలో, నీటిలో కలిపి 84 లక్షల రకాల జీవరాసులున్నాయట. మనం మహా అయితే మన జీవితకాలం మొత్తంలో ఓ వెయ్యి జీవరాసులనుకూడా చూస్తామో లేదో. అయితే ఆ సృష్టికర్త నవ్వే గుణం మాత్రం ఒకే ఒక్క మానవుడికి మాత్రమే ప్రసాదించాడు.

మరి మనం రోజూ చూసే కుక్క నవ్వుతుందా? మొరిగేటప్పుడు దాని ముఖం వికారంగ, వికృత కంగా కనబడుతుంది. మనం ప్రేమతో చేరదీస్తే తోక ఆడిస్తుందే కానీ నవ్వుతుందా? అంటే నవ్వే అదృష్టం ఈ సృష్టిలో ఒక్క మానవుడికే ఉంది. మరి ఇటువంటి నవ్వును ఎంతమంది మనుషులు సద్వినియోగ పరుచుకుంటున్నారు.

2016లో ఓ అధ్యయన సంస్థ దేశంలో 20నగరాలలో నవ్వ్వు గురించి సర్వే జరిపింది. మొదటి స్థానం హర్యానా రాష్ట్రంలోని జలందరు నగరం ఉంటే, హైదరాబాద్‌ నగరం 18వ స్థానంలో ఉంది.

మరి జలందర్‌ నగ రం ఎందుకు అగ్రస్థానంలో ఉంది. అంటే అక్కడ ప్రతి బస్తీలో కూడా నవ్వుల సంఘాలు (లాఫింగ్‌ క్లబ్‌లు) ఉంటాయట. ప్రతి రోజు సాయంత్రం కనీసం ఓ గంట కొంత మంది సమావేశమై జోకులు చెప్పుకొని నవ్వుకుంటారట.

మరి మన నగరంలో ప్రతి బస్తీలో కాలనీ అసోసియేషన్లు ఉంటాయి. కాని నవ్ఞ్వల ప్రస్తావనే ఉండదు. అంటే హైదరాబాదీలు దాదాపు నవ్వనే నవ్వరు. అందుకే మననగరంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి బిపి, షుగర్‌ ఉంటుంది. అడుగడుగున మెడికల్‌ శాపులుంటాయి. మన పూర్వీకులు కొన్ని సామెతలను, నానుడిలను పుట్టించారు. ఇప్పటికీ వాటిని మన దైనందిన జీవితంలో ఉపయోగించుకుంటున్నాం.

కారణం అవి ఎంతో నిజంగా,సమంజసంగా ఉంటాయి. అలాంటి వాటిలో నవ్వు నాలుగువిధాల చేటు అనేది కూడా ఒకటి. ఇప్పుడు ఈ ‘నానుడి మాత్రం తప్పు.ఆనాటి కాలానుగుణంగా పుట్టిందేమో కానీ ఇప్పటి పరిస్థితులలో నవ్వు నాలుగు విధాల మేలు అనేది సత్యం. సమంజసం.

మరి మేలు చేసే నాలుగు విధాలు ఏమిటి? మొదటిది నవ్వడం వల్ల ముఖంలోని కండరాలలో కదలిక కలిగి,అవి శరీరమంతటికి వ్యాపించి బి.పి, షుగర్‌ లాంటి రోగాలను దరికి రాకుండా చేస్తాయి.

ఈ విషయం డాక్టర్లు సైతం చెపుతున్నారు.ఇక రెండవది చిరునవ్వు మన అందాన్ని ద్విగుణీ కృతం చేస్తుంది. మూడవది చిరునవ్వు గౌరవమర్యాదలలో లీనమై ఉంటుంది.స్నేహితులుగాని, బంధువ్ఞలు కాని, పెద్దలు కాని ఎదు రుపడ్డప్పుడు, కలిసినప్పుడు నమస్కారం చేస్తూ బాగున్నారా? అని నవ్వుతో పలకరిస్తాం.

అంతేకాని కోపంతోనో, ఆవేశంతోనో పలకరించగా, అందుకే నవ్వుతూ మాట్లాడమనేది గౌరవ మర్యా దలతో కూడుకున్నదని చెప్పవచ్చు. పెళ్లిళ్లలో శుభకార్యాలయాలో ఆడవాళ్లు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు చిరునవ్వుతో ఆలింగనం చేసుకొంటూ యోగక్షేమాలు మాట్లాడుకుంటారు.

నవ్వే ప్రధాన భూమిక వహిస్తుంది. ఇక నాలుగవది చిరునవ్వు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతుంది.అంటే తొందరగా ముసలివాళ్లం అవ్వ మన్నమాట. అందుకే మనంనవ్వుతూ నలుగురిని నవ్విస్తూ జీవితం గడపాలి.

కొంతమంది ఎప్పుడూ నవ్వుతూ ఉంటారంటే వాళ్లకు ఎటువంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు లేకకాదు. వాటన్నింటిని అధిగమించే శక్తిసామర్థ్యాలు ఒక్క చిరునవ్వుకు ఉన్నాయని వారి నమ్మకం.నవ్వుకు వయసుతో నిమిత్తం లేదు. బేధంలేదు.

అంతేకాదు కుల,మత, ప్రాంత, భాష, ఆర్థిక తారత మ్యాల ఉనికే ఉండదు. నవ్వడానికి కావలసింది మనసు స్పందన మాత్రమే. అందుకే ఒక్క జోకు చాలు పడిపడి నవ్వడానికి, ఆ రోజంతా హాయిగా గడపడానికి. ద్వేషం, కోపం, పగ, అసూయ, కసి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి.

కాని చిరునవ్వుమాత్రమే మనుషుల మధ్య ప్రేమను,అప్యాయతను,అనురాగాన్ని, అన్యోనతను చిగురింప చేస్తుంది.ఉద్యోగులు, వర్తకులు, వ్యాపారా లు వారి విధి నిర్వహణలో పడి నవ్వడమే మర్చిపోతారు. కొంత మంది సంపాదనలో పడి నవ్వితే నాకేం లాభం అనుకుంటారు.

మన బంధువులుగాని,స్నేహితులు కాని బాధలలో, కష్టాలలో ఉన్నప్పుడు మనం వారిని కలిసి ఓదార్చి,కాసేపు నవ్విస్తే వారికి కొంతలో కొంతైన ఉపశమనం కలుగుతుంది.

వారపత్రికలు, మాస పత్రికలు అక్కడక్కడ జోకులు ప్రచురిస్తుంటారు.పాఠకులు కాసేపు నవ్ఞ్వకొని రిలాక్స్‌ అవ్వాలని, 70ఏళ్లు తెలుగుచలన చిత్రాలను పరిశీలిస్తే కథాబలం ఉన్న చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా హాస్యచిత్రాలు ప్రజాదరణ పొందుతాయి.

అందుకే ప్రతి సినిమాలో హాస్యసన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయి. నవ్వించేవాడు యోగి, నవ్వెవాడు బోగి, నవ్వలేనివాడు రోగి అన్నాడొక ప్రముఖ సినీ హాస్యరచయిత. నవ్వించేవాడు సైస్‌ఫెలో, నవ్వెవాడు లక్కిఫెలో, నవ్వలేనివాడు బఫెల్లో అన్నాడొక ఆస్ట్రేలియిన్‌ హాస్యరచయిత.

Laughter is good in four ways

ఒకే ఒక్కరోజు మాత్రమే బతికే పువ్వు విరబూసి, అందంగా ఊగుతూ నవ్వ్వుతూ బతుకుంటే నూరేళ్లు జీవించే మనం నవ్వుతూ బతకలేమా?నవ్వుఅనేది కల్పవృక్షంలాంటిది.మనం నవ్వును ఎంత ఆస్వాదిస్తామో అంత పరిమళం ఇస్తూనే ఉంటుంది.

అందుకే నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కలిగేది ఆనందం, నవ్వుతూ, నవ్విస్తూ, పదికాలాలపాటు జీవిస్తే అదే జీవిత పరమానందం. జీవితం ఎప్పుడు,ఎలా ముగుస్తుందో మనకు తెలియదు. అందుకే ఎన్నికష్టాలోచ్చినా నవ్వుతూ బతికేయడం అలవర్చుకోవాలి.

స్నానం దేహాన్ని, ధ్యానం బుద్ధిని, ప్రార్థన ఆత్మను, దానం సంపాదనను, ఉపవాసం ఆరోగ్యాన్ని,క్షమాపన బంధాలను,వినయం అనుబంధా లను శుద్ధిచేస్తాయి.

కష్టాల్ని, బాధల్ని మనలో దాచుకొని, నవ్వును మాత్రం నలుగురికి పంచాలి.అదే మనల్ని ఉన్నతులుగా మార్చు తుంది. అంతేకాదు మనకు సంతృప్తిని మిగిలుస్తుంది.

-మునిగంటి శతృఘ్నచారి, (రచయిత: కార్యదర్శి, రాష్ట్ర బి.సి.సంఘం)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/