రజనీకాంత్ సాధారణ హెల్త్ చెకప్‌ కోసమే హాస్పటల్ కు వెళ్లారు – లతా రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పటల్ లో చేరారనే వార్త అభిమానుల్లో , సినీ ప్రేక్షకుల్లోనే కాదు సినీ ప్రముఖుల్లోను ఆందోళన కలిగించింది. సడెన్ గా రజని హాస్పటల్ లో చేరడం ఏంటి అని ఖంగారు పడుతూ ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడం స్టార్ట్ చేసారు. ఇదే క్రమంలో పలు మీడియా లలో , సోషల్ మీడియా లలో అనేక పుకార్లు ప్రచారం కావడం తో అంత ఖంగారు పడుతున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ భర్త లతా రజనీకాంత్..రజని హాస్పటల్ లో ఎందుకో చేరారో క్లారిటీ ఇచ్చారు.

ఆమె మాట్లాడుతూ.. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రిలో చేరారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఏడాదికి ఒకసారి ఇలాంటి పరీక్షలు సర్వసాధారణమైన విషయమేనని పేర్కొన్నారు.

ఇక రజని సినిమాల విషయానికి వస్తే.. శివ డైరెక్షన్లో అన్నాత్తే అనే మూవీ చేసారు. ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 04 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో పెద్దన్న గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం తాలుకా టీజర్ రీసెంట్ గా విడుదలై ఆకట్టుకుంది.