వివేకానంద రెడ్డి అంత్యక్రియలు పూర్తి


పులివెందుల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి స్వయాన సోదరుడైన వైఎస్‌ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నిన్న హత్యకు గురి కాగా, నేడు ఆయన అంత్యక్రియలు పులివెందులలోని రాజారెడ్డి ఘాట్‌లో నిర్వహించారు. ఆయనకు చివరిసారి నివాళులు అర్పించేందుకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ నేతలు తరలి వచ్చారు. తమ అభిమాన నేతకు అశ్రునయనాలతో కడసారి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో వైఎస్‌ వివేకా కుటుంబ సభ్యులతో సహా వైఎస్‌ఆర్‌సిపి పార్టీ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కొందరు ఇతర పార్టీ నేతలు కూడా హాజరయ్యారు.