యూట్యూబ్‌ మిలియనీర్‌…రియాన్‌

ryan
ryan

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడి కొందరి జీవితాల్లో మాత్రమే నిజమౌతుంది. ఆ కొద్ది మందిలో స్థానం సంపాదించాడు అమెరికాకు చెందిన ఏడేళ్ల రియాన్‌. ఈ ఏడు ఫోర్బ్స్‌ నిర్వహించిన సర్వేలో యూట్యూబ్‌ ద్వారా అధిక సంపాదన ఆర్జించే వారి జాబితా విడుదల చేసింది. ఇప్పుడు ఆ యూట్యూబ్‌ మిలయనీర్‌గా మొదటి స్థానంలో నిలిచాడు రియాన్‌. 2015లో రియాన్‌ టా§్‌ు్స రివ్యూ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. రోజూ చిన్నారుల బొమ్మల వీడియోలు అప్‌లోడ్‌ చేశేవాడు. కొద్దిరోజుల్లోనే ఆ వీడియాలకు అభిమానులు పెరిగిపోయారు. ప్రపంచవ్యాప్తంగా రియాన్‌ ఛానల్‌ను దాదాపు కోటికి పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే రకరకాల బొమ్మలపై రివ్యూలు ఇస్తుంటాడు. ఆ బొమ్మల మాదిరిగానే మేకప్‌ వేసుకుంటాడు. యాంగ్రీబర్డ్‌, సూపర్‌ హీరో వంటి కార్టూన్‌ టా§్‌ు్స, రైళ్లు, విమానాలు ఇలా ఎన్నెన్నో కొత్తగా వచ్చిన పిల్లల బొమ్మలతో ఆడుకుంటాడు. అవి ఎలా పనిచేస్తాయో అందులో వివరిస్తాడు. ఆ వీడియోల్ని తన ఛానల్‌లో పోస్ట్‌ చేయగా వాటిని కొన్ని లక్షల మంది చూడటం వల్ల లెక్కలేనన్ని యాడ్స్‌వచ్చాయి. ఈ ఏడాది రియాన్‌ తన వీడియోల ద్వారా 150 కోట్లు సంపాదించాడు.