ప్రపంచకప్‌కు ఆసీస్‌ జట్టు జాబితా

australia team 2019
australia team 2019


సిడ్నీ: సోమవారం ఉదయం ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఆ దేశ ప్రపంచకప్‌ జట్టును ప్రకటించింది. ఇందులో మాజీ సారథి స్మిత్‌, వార్నర్‌లకు చోటు కల్పించారు. మార్చి 2018లో నిషేధం తర్వాత ఇప్పటి వరకు వీరిద్దరూ ఒక్క అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఐనా వారి సామర్ధ్యం మీద నమ్మకంతో ఆసీస్‌ మేనేజ్‌ మెంట్‌ మెగా టోర్నీకి ఎంపిక చేసింది. మొత్తం 15 మంది ఆటగాళ్ల జాబితాను ఆసీస్‌ ఇవా ళ ప్రకటించింది. ఫాస్ట్‌ బౌలర్‌ హేజిలవుడ్‌ను పక్కన పెట్టేశారు. ఇద్దరు స్పిన్నర్లు ఆడం జంపా, నాథన్‌ లౌయన్‌లతో పాటు పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌, బెహ్రెండార్ఫ్‌, రిచర్డ్‌సన్‌, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ లకు చోటు దక్కింది.
ఆస్ట్రేలియా జట్టు:
అరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖ్వాజా, స్టివ్‌ స్మిత్‌, షాన్‌ మార్ష్‌, అలెక్స్‌ కేరీ, మార్కస్‌ స్టాయినీస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ స్టార్క్‌, జే రిచర్డ్‌సన్‌, పాట్‌ కమిన్స్‌, బెహ్న్రెండార్ఫ్‌, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, ఆడం జంపా, నాథన్‌ లైయన్‌

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/