ఢిల్లీ మెట్రో,బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కేజ్రీవాల్‌ కసరత్తులు

kejriwal
kejriwal

న్యూఢిల్లీ: రానున్న అసెంబ్లీఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ఇప్పటినుంచే కసరత్తులుప్రారంభించారు. వచ్చే ఏడాదిప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఆమ్‌ ఆద్మీపార్టీ ప్రభుత్వం మెట్రో, బస్‌ ప్రయాణాలు మహిళలకు ఉచితంగా కల్పించాలని, ప్రజారవాణాను వినియోగించుకునేవిధంగా వారిని ప్రోత్సహించేందుకు ఈచర్యలుచేపట్టినట్లుప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్‌ ఇటీవల నిర్వహించిన ఒక బహిరంగసభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్‌ నియంత్రణ సంస్థతో సంప్రదింపులు జరిపి విద్యుత్‌ బిల్లులు తగ్గించేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఇపుడు కొత్తగా డిటిసి బస్సులు, ఢెల్లీ మెట్రోలో మహిళలకు ఉచితప్రయాణం కల్పించాలనినిర్ణయించింది. సోమవారం ఇందుకు సంబంధించి ఒకప్రకటన విడుదలచేస్తుందని అంచనా. ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్‌ గెహ్లట్‌ ఇప్పటికే వివిధ సంఘాలతో సంప్రదింపులు జరిపారు. మొత్తం అన్ని బస్సుల్లోను ఛార్జిలు మినహాయించాలని సూచించారు. డిటిసి, డిఐఎంటిఎస్‌, ఢిల్లీ మెట్రోల్లో ఈ రవాణా రాయితీ మహిళలకు కల్పించాలనినిర్ణయించారు. ఢిల్లీ ఇంటిగ్రేటెడ్‌ మల్టీమోడల్‌ సిస్టమ్‌ కింద నడుపుతున్న బస్సుల్లో ఉచితంగా అవకాశం ఇవ్వడం కష్టమని మెట్రోరైళ్లలోకూడా కష్టమేనని వెల్లడించారు. కేంద్రం, రాష్ర టప్రభుత్వం ఢిల్లీమెట్రోరైల్‌కార్పొరేషన్‌లో 50శాతం వాటాలతో ఉన్నాయి. ఇక పట్టణాభివృద్ధి వ్యవహారాలు, ఢిల్లీప్రభుత్వం మధ్య కూడా మెట్రోధరల పెంపు, ఐదవ దశ నిర్మాణాలపై ఇప్పటికీ బేధాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇతర అంశాలకు సంబంధించి సాంకేతిక, ఆర్ధిక ఆవశ్యకతను కూడా చర్చించడంలోముందుకురావడంలేదు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/