8 వికెట్ల తేడాతో విండీస్ గెలుపు

Windies won by 8 wickets

Tiruvanantapuram: గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో  భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు శివం దూబే 54, రిషబ్ పంత్ 33, కోహ్లీ 19, రోహిత్ శర్మ 15, కేఎల్ రాహుల్ లు 11 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లు విలియమ్స్, వాల్స్ కు రెండు చొప్పున వికెట్లు పడగా, షెల్డన్, హోల్డర్, పీరేలకు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు పడ్డాయి. 171 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు 18.3 ఓవర్లలో 173 పరుగులు చేసింది. 9 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. విండీస్ బ్యాట్స్ మెన్లు లెండి సిమ్మన్స్ 67, లూయిస్ 40, పూరన్ 38 పరుగులు చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/