టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌

PAK vs WI
PAK vs WI

నాటింగ్‌హామ్‌: వన్డే ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పాకిస్థాన్‌పై టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కీలక ఆటగాళ్లు ఎవిన్‌ లూయిస్‌, షానన్‌ గాబ్రియెల్‌ ఫిట్‌గా లేకపోవడంతో మ్యాచ్‌కు దూరమైనట్లు చెప్పాడు. ఇంగ్లీష్‌ గడ్డపై ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్‌ అదే స్పూర్తితో స్పూర్తిదాయక ప్రదర్శన చేయాలని భావిస్తుంది.
పాక్‌ సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఫిట్‌నెస్‌ సాధించిన పేసర్‌ మహ్మద్‌ ఆమీర్‌కు చోటు లభించింది. విండీస్‌పై విజయంతో వరుస ఓటములకు బ్రేక్‌ వేయాలని ఆశిస్తుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/