ఢిల్లీని ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దుతాం

kejriwal
kejriwal, AAP president


న్యూఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం పేరుతో ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేవే. అదే కోవకు చెందుతుంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సియం, ఆప్‌ అధినేత కేజ్రివాల్‌ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ..ఢిల్లీని పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఢిల్లీలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాలుష్యం పెరగటానికి కారణం బిజెపి నేతలే నని ఆరొపించారు. తమ పరిధిలోని పాఠశాలలు, ఆసుపత్రుల పనితీరును మెరుగుపరిచామని, అదేవిధంగా ఏడు లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధులను గెలిపిస్తే ఢిల్లీని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

తాజా మహిళల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/