రైళ్లలోను వైఫై: పీయూష్‌ గోయల్‌

piyush goyal
piyush goyal

న్యూఢిల్లీ: భవిష్యత్తులో రైళ్లలోను వైఫై సదుపాయం కల్పిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. రైళ్లలో వైఫై ఏర్పాటుకు పెట్టుబడులతో పాటు టవర్ల ఏర్పాటు, అందుకు తగిన సామగ్రి, విదేశీ సాంకేతికత, పెట్టుబడులు అవసరమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ తెలిపారు. రైళ్లలో వైఫై తీసుకొస్తే భద్రతపరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయన్నారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో సిసిటివి కెమెరాల ద్వారా పోలీస్‌స్టేషలనకు లైప్‌ ఫీడ్‌ అందుతుందన్నారు. వైఫై ద్వారా ఇందుకు కావాల్సిన సిగ్నలింగ్‌ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని మరో నాలుగున్నరేళ్లలో రైళ్లలో వైఫై సదుపాయం అందిస్తామని ఆయన చెప్పారు. వైఫై ద్వారా సిగ్నలింగ్‌ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందన్నారు. మరో నాలుగున్నరేళ్లలో రైళ్లలో వైఫై సదుపాయం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలోని 5,150 రైల్వేస్టేషన్లలో వైఫై సేవలు అందుతున్నాయి. ఈ యేడాది చివరలో ఈ సంఖ్యను 6,500లకు పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రైల్వేస్టేషన్లలో ఆధునీకరణ పనులు ప్రైవేట్‌ సంస్థలతో కొనసాగిస్తున్నారు. భోపాల్‌లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అక్కడి రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని మంత్రి చెప్పారు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/