మాల్యా బారి నుంచి తప్పించుకున్న బ్యాంక్‌!

హెచ్‌డిఎఫ్‌సి అనుభవాన్ని పంచుకున్న ఆదిత్య పురి

Adithya Puri
Adithya Puri , HDFC bank CEO

ముంబై: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ఎండి, సిఈఓగా బాధ్యతలను నిర్వహిస్తున్న ఆదిత్య పురి ప్రముఖ జర్నలిస్టు తమల్‌ బంధోప్యాయ రచించిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విజయ మాల్యాపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మనం ఎవరితోనైనా కలిసి కాఫీ తాగవచ్చు… కాని మనం ఏది అనుకుంటామో అదే చేయాలి. వ్యక్తిగత విషయాలను వృత్తిలోకి తీసుకుని రాకూడదు అని గతంలో విజయమాల్యా సిబ్బంది రుణం తీసుకోవడాన్కి తన వద్దకు వచ్చారని, ఐతే దరఖాస్తు పరిశీలిస్తానని చెప్పి వారికి కాఫీ ఇచ్చి పంపించేశానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత దరఖాస్తును తన సహచరుడు పరేష్‌కు అందజేశాను. ఆయనకు మాల్యా విషయం అర్థమై..ఆ దరఖాస్తును తన సహచరుడు తిరస్కరించాడు. ఆ తర్వాత మాల్యా ఫోన్‌ చేసిన ప్రతిసారి ఆవేశంగా మాట్లాడేవరని, స్నేహం..బ్యాంకింగ్‌ అనే రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు అని అన్నారు. దీంతో అలా పెను ముప్పు నుంచి బయట పడగలిగామని, లేకపోతే ఆయన చుట్టూ తిరిగే గతి పట్టేదని వాపోయారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/