ఈవైరస్‌ మనతో పాటు సుదీర్ఘకాలం ప్రయాణిస్తుంది..

వైరస్‌ నియంత్రణ చర్యలో చిన్న తప్పు కూడా చేయవద్దు: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

Tedros Adhanom
Tedros Adhanom

అమెరికా: ప్రపంచంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజు పెరుగుతున్న నేపథ్యలో కరోనా నియంత్రణ చర్యల విషయంలో చిన్న తప్పు కూడా చేయవద్దని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. భూ మండలంపై ఉన్న మానవాళితో సుదీర్ఘకాలం పాటు కరోనా మహమ్మారి కలిసి నడవనుందని, చాలా దేశాలు వైరస్ తొలి దశలోనే ఉన్నందున నియంత్రణ చర్యలు పట్టించాలని తెలిపింది. కాగా కరోనాను నియంత్రించారని భావించిన దేశాల్లోనూ తిరిగి కేసుల సంఖ్య పెరుగుతోందని, ముఖ్యంగా ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఈ ప్రమాదం అధికంగా పొంచివుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టీడ్రాస్ అడ్హనామ్ వ్యాఖ్యానించారు. తాజాగా జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘పశ్చిమ యూరప్ లోని చాలా ప్రాంతాల్లో వైరస్ స్థిరంగా లేదా తగ్గుతూ ఉంది. కొన్ని దేశాల్లో బాధితుల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నా, సెంట్రల్ మరియు సౌత్ అమెరికాలో, పశ్చిమ యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి విషయంలో చాలా దేశాలు తొలి దశలోనే ఉన్నాయి. ఈ దశలో ఏ చిన్న తప్పు కూడా చేయవద్దు. ఈ వైరస్ మనతో పాటు సుదీర్ఘకాలం పాటు ప్రయాణిస్తుందన్న విషయాన్ని గుర్తెరగాలి’ అని ఆయన అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/