ఎవరిని నమ్మాలో అర్ధం కావడం లేదు?

vijay mallya
vijay mallya


లండన్‌: తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తానన్న బ్యాంకులు తీసుకోవడం లేదంటూ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు విజ§్‌ు మాల్యా. తాజాగా ప్రధాని మోదిపై విమర్శలు చేశారు. తాను చెల్లించే బకాయిల విషయంలో ప్రధాని మోదిని నమ్మాలో లేక బ్యాంకులు చెప్పే మాటలు నమ్మాలో అర్ధం కావడంలేదని సందేహం వెలిబుచ్చారు.
బ్యాంకులకు తాను చెల్లించే రుణాల కన్నా ఎక్కువగానే ప్రభుత్వం రికవరీ చేసుకుందని, స్వయంగా ప్రధానే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారని మాల్యా అన్నారు. కానీ కొన్ని బ్యాంకులు ఇంగ్లీష్‌ కోర్టుల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా చెప్పయని, ఎవరిని నమ్మాలో అర్ధం కావడం లేదని అన్నారు. ఐతే మోది లేదా బ్యాంకులు ఎవరో ఒకరు అబద్ధం చెప్పి ఉండాలి అని మాల్యా ట్వీట్‌ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/