త్వరలో భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల సేవల ప్రారంభ0

Whats App Payment Services
Whats App Payment Services

సామాజిక మాధ్యమం వాట్సాప్‌ త్వరలో డిజిటల్‌ చెల్లింపుల సేవలను భారత్‌లో ప్రారంభించనుంది. డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలన్న రిజర్వు బ్యాంకు నిబంధనలకు పూర్తి స్థాయిలో ఈ సంస్థ కట్టుబడటంతో ఆ దిశగా ముందడుగు పడుతోంది. ప్రస్తుతం డేటా నిల్వ, ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఖరారు చేస్తోంది. అంతా అనుకున్న విధంగానే జరిగితే అక్టోబర్‌ -డిసెంబర్‌ మధ్య వాట్సాప్‌ తన చెల్లింపుల సేవలను ప్రారంభించనుంది.