ప్రపంచకప్‌ చరిత్రలో రెండోసారి గేల్‌ డకౌట్‌

chris gayle
chris gayle, west indies batsman

టాంటన్‌: ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా బరిలో దిగిన వెస్టిండీస్‌ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఒంటిచేత్తే మ్యాచ్‌ను గెలిపించే సత్తా కలిగిన ఆటగాళ్లు కీలకమైన పవర్‌ప్లేలోనూ రాణించలేకపోతున్నారు. తాజాగా బంగ్లాతో మ్యాచ్‌లో విండీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ డకౌట్‌ అయ్యాడు. 13 బంతులాడిన గేల్‌ కనీసం సింగిల్‌ కూడా తీయలేకపోయాడు. ప్రపంచకప్‌ చరిత్రలోనే బంగ్లా(2003 ,2019)తో మ్యాచ్‌లోనే రెండుసార్లు గేల్‌ డకౌట్‌ కావడం గమనార్హం. సౌఫుద్దీన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో కీపర్‌ రహీమ్‌కు ఈజీ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 19 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి విండీస్‌ 82 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఎవిన్‌ లూయిస్‌(44), షాయ్‌ హోప్‌(30)లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/