రజనీకాంత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

rajani kanth
rajani kanth

చెన్నై: కొత్త పార్టీ ఎప్పుడు ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ శుభవార్త చెప్పారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్దమని ప్రకటించారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ లేక అన్నాడింకే ప్రభుత్వం పడిపోతే ఆ తర్వాత జరిగే శాసనసభ సమరంలో బరిలోకి దిగుతారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు రజనీ సానుకూలంగా స్పందించారు. దీనిపై ఎన్నికల మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం వెలువరిస్తానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన చేసిన ప్రకటన అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/