‘ఆర్సీబికి ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా’

Yuzvendra Chahal
Yuzvendra Chahal, RCB batsman


న్యూఢిల్లీ: ఐపిఎల్‌ ఉన్నన్ని రోజులు ఆర్సీబికే ఆడతానని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు యజువేంద్ర చాహల్‌ అన్నాడు. ఆర్సీబి తనకు కుటుంబం లాంటిదని అన్నాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 2014లో ఐపిఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ఇన్ని సంవత్సరాలు ఒకే జట్టుకు ఆడతానని అనుకోలేదు. ఆర్సీబికి ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తానని, జీవితాంతం ఆర్సీబి జట్టుకే ఆడాలనుకుంటున్నానని అన్నారు. కోహ్లి గురించి చెప్పాలంటే..జట్టు కెప్టెన్‌ మనకు వెన్నంటి ఉంటే ఏ ఆటగాడైనా మంచి ప్రదర్శనలు ఇవ్వగలడని, కోహ్లి అదే చేస్తుంటాడని, టీమ్‌ యాజమాన్యం తెర వెనకాల నుండి సహకరిస్తుందని, ప్రతి బంతికి వికెట్‌ తీయాలన్న కసితో బౌలింగ్‌ చేయాలని కోహ్లి ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాడని చాహల్‌ అన్నాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/