తాజ్‌ వద్ద మూడు గంటలకు పైగా ఉంటే జరిమానా

TAJ MAHAL
TAJ MAHAL

ఆగ్రా: ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను సందర్శించటానికి వచ్చే సందర్శకులకు కేవలం మూడు గంటలు మాత్రమే అనుమతించనున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తాజ్‌ మహల్‌ సందర్శకులను నియంత్రించేందుకు వీలుగా ఆగ్రా పురావస్తు శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజ్‌మహల్‌కు లోకి వెళ్లేందుకు మొత్తం 14 గేట్లు ఏర్పాటు చేశారు. లోపలకు వచ్చిన సందర్శకులు కేవలం మూడు గంటలు మాత్రమే అనుమతిస్తారు. అంత కంటే ఎక్కువ సమయం ఉంటే వారికి ఎగ్జిట్‌ గేటు వద్ద జరిమానా విధించాలని నిర్ణయించినట్లు ఆగ్రా పురావస్తు శాఖ సూపరింటెండెంట్‌ వసంత్‌ స్వరాంకర్‌ చెప్పారు. ఈ చారిత్రక సమాధిని చూడటానికి రోజూ వేల మంది వస్తూ ఉంటారు. తాజ్‌ పరిరక్షను పరిగణనలోకి తీసుకుని పురావస్తు శాఖ అధికారులు సందర్శకులను నియంత్రించేందుకు మూడు గంటల సమయం నిబంధనను తీసుకువచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/