చిరకాల ప్రత్యర్థితో ఆటకు సిద్ధం

మేము నైపుణ్యం ఉన్న ఆటగాళ్లం

virat kohli
virat kohli,

నాటింగ్‌హామ్‌: చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ రద్దైన అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడాడు. తాము మైదానంలోకి వెళ్లగానే ఒత్తిడి, ఆందోళన మరచిపోయి ప్రశాంతంగా ఉంటామని అన్నారు. తాము నైపుణ్యం కలిగిన ఆటగాళ్లమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరి మధ్యా గట్టి పోటీ ఉందని, పాక్‌తో ఆడేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం భారత్‌ పాక్‌ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/