బౌలర్‌ను ఆటపట్టించిన కోహ్లి

virat kohli
virat kohli

కోల్‌కత్తా: ఈ ఐపిఎల్‌ సీజన్‌లో తరచుగా మన్కడింగ్‌ పదం మార్మోగుతుంది. ఈ సీజన్‌ 12వ మ్యాచులో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ స్కిప్పర్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారానే రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ బట్లర్‌ను ఔట్‌ చేశాడు. ఐఏ నిన్న రాత్రి కోల్‌కత్తా వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మన్కడింగ్‌పై సరదా సంఘటన చోటుచేసుకుంది.
బెంగళూరు ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌ను కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ బౌలర్‌ సునీల్‌ నరైన్‌ వేశాడు. ఈ ఓవర్‌ చివరి బంతిని క్రీజులో ఉన్న స్టాయినిస్‌కు వేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చిన నరైన్‌ బంతిని వేయలేక మధ్యలోనే ఆగిపోయి వెనక్కి తిరిగాడు. నాన్‌ స్ట్రయికింగ్‌లో కోహ్లి ఉన్నాడు. ఐతే నరైన్‌ మన్కడింగ్‌ చేసేందుకు చూడనప్పటికీ కోహ్లి వెంటనే బ్యాటును క్రీజులో పెట్టాడు. అంతటితో ఆగకుండా మోకాళ్లపై కూర్చుని బ్యాటును పూర్తిగా క్రీజులో పెడుతూ..ఇప్పుడు మన్కడింగ్‌ చే§్‌ు అంటూ నరైన్‌ను ఆటపట్టించాడు.
రాత్రి జరిగిన మ్యాచులో కోల్‌కత్తాపై బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి శతకం బాది మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ను అందుకున్నాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/