ఫోటోల‌కు ఫోజులిచ్చిన వ‌ర‌ల్డ్‌క‌ప్ సార‌థులు

world cup teams captains
world cup teams captains

లండ‌న్ః మరో ఆరు రోజుల్లో ప్రపంచకప్‌ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ప్రపంచ కప్‌లో పాల్గొనబోయే జట్ల సారథులందరూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ ప్రపంచ కప్‌లో భారీ స్కోర్లు నమోదు కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మీడియా సమావేశం ముగిసిన అనంతరం వివిధ జట్ల సారథులందరూ ఫొటోలకు పోజులిచ్చారు. 10 జట్ల కెప్లెన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా పోజిచ్చిన ఫొటోలను ఐసీసీ తమ అధికారిక ట్విటర్‌లో పంచుకుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. జూన్‌ 5న సౌథాంప్టన్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. 

తాజా క్రీడా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/sports/