భారత్‌పై పాక్‌ నిరసనను ఖండించిన బ్రిటన్‌

Domici raab
Domici raab

లండన్‌: ఆర్టికల్‌ 370 రద్దు అయిన తర్వాత పాకిస్థాన్‌కు ఎక్కడికి వెళ్లినా అవమానం తప్పడం లేదు. అయినా ఏదో ఒకవిధంగా తన నిరసనను వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా యూకెలోని భారత హైకమిషన్‌ కార్యాలయం ముందు పాకిస్థాన్‌ మద్దతుదారులు నిరసన చేపట్టారు. దీన్ని బ్రిటిష్‌ విదేశాంగ కార్యదర్శి డామినిక్‌ రాబ్‌ ఖండించారు. ఇలాంటి నిరసనలను చేపట్టే ఏ వర్గానికి చెందిన వారైనా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంటులో డామినిక్‌ మాట్లాడుతూ వర్గాల మధ్య ఘర్షణలను అనుమతించబోమన్నారు. లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ సైతం ఈ ఘటనను ఖండించారు. కాశ్మీర్‌ అంశంలో భారత్‌ నిర్ణయంపై నిరసన తెలియజేస్తూ పాక్‌ మద్దతుదారులు భారత హై కమిషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండవసారి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/