విజయవాడలో హై టెన్షన్

Vijayawada: High Tension Prevails
Vijayawada: High Tension Prevails

Vijayawada: విజయవాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడ ప్రధాన కూడళ్లల్లో పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లే రహదారులైన బెంజి సర్కిల్, ప్రకాశం బ్యారేజి, కనకదుర్గమ్మ వారధి వద్ద ప్రత్యేక పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ దినేష్ రెడ్డి, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, కేఈ ప్రభాకర్‌లతో పాటు మాజీ ఎంపి కొనకళ్ల నారాయణలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.