కేసీఆర్ మహారాజుగా ఊహించుకుంటున్నారు

Vijaya shanti
Vijaya shanti

Hyderabad: ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. యాదగిరి గుట్ట ఆలయంలో స్తంభాలపై దేవతా మూర్తులతోపాటు తన బొమ్మను, కారు గుర్తును, ప్రభుత్వ పథకాలను చెక్కించుకోవడం ఏమిటని నిలదీశారు. కేసీఆర్ తన దొరతనాన్ని ప్రదర్శిస్తున్నారని, ఈ ధోరణి ప్రజాస్వామ్యానికే ముప్పు అని విజయశాంతి ఓ ప్రకటనలో విమర్శించారు. యాదాద్రి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకుంటూ దాని పవిత్రతను దెబ్బ తీస్తున్నారని అన్నారు.