పోటీ చేయడం లేదని వీరు స్పష్టం

virender sehwag
virender sehwag

న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పోటీ చేస్తారని వార్తలు షికారు చేశాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సెహ్వాగ్‌ నిరాకరించాడని ఢిల్లీకి చెందిన బిజెపి నాయకుడొకరు స్పష్టం చేశారు. ఎన్నికల వేళ రాజకీయ నాయకులు సెలబ్రెటీలను బరిలోకి దించడం మామూలే. ఆ నేపథ్యంలోనే పశ్చిమ ఢిల్లీ నుంచి సెహ్వాగ్‌ను బరిలో దింపాలని బిజెఇప భావించిందని, అందుకు ఆయన ఆసక్తి చూపండం లేదని అన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజకీయ అరంగేట్రం చేయడం లేదని, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన, ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి లేదని సెహ్వాగ్‌ చెప్పినట్లు బిజెపి నేత పేర్కోన్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌ బిజెపి టిక్‌ట్‌ మీద హర్యానాలోని రోహ్‌తక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఈ ఏడాది ఫిబ్రవరిలో వార్తలు వెలువడినాయి. దీనిపై సెహ్వాగ్‌ స్పందిస్తూ..అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు.